e-చెల్లింపులు చేస్తే బిల్లులో 0.75% డిస్కౌంట్ ఇవ్వనున్న బీఎస్‌ఎన్‌ఎల్

0
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్  తమ ఫోన్ వినియోగదారుల కోసం డిస్కౌంట్ ఆఫర్  ప్రవేశ పెట్టింది. ఆన్‌లైన్‌లోగానీ, ఎలక్ట్రానిక్ పద్ధతిలో గానీ e-చెల్లింపులు చేస్తే బిల్లులో 0.75% డిస్కౌంట్ ఇస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలన్న ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా తమ వినియోగదారులంతా క్యాష్‌లెస్ సొసైటీ దిశగా అడుగేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సర్వీస్ చార్జీ మినహా బిల్లు మొత్తానికి ఈ రాయితీ వర్తిస్తుందనని పేర్కొంది.

ఈ పధకం మార్చి 31 వరకు (ల్యాండ్ లైన్, బ్రాడ్ బాండ్, జీఎస్‌ఎం) పోస్ట్ పెయిడ్‌తోపాటు జీఎస్‌ఎం ప్రీపెయిడ్ రీచార్జి బిల్లులకు వర్తిస్తుందని తెలిపింది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top