వర్చువల్‌ రియాలిటీ తో లెనోవో సరికొత్త Vibe K4 Note రూ.11,999 ధరకు

0
లెనోవో సరికొత్త  Vibe K4 Note. స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. ‘థియేటర్‌మ్యాక్స్‌’ టెక్నాలజీతో ఫోన్‌లోని విజువల్‌ మీడియాని కళ్లకు కట్టినట్టుగా ‘వర్చువల్‌ రియాలిటీ’లో చూడొచ్చు. 

ఈ తరహా టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ మొబైల్‌ ఇదేనట. ఎలాంటి మల్టీమీడియా కంటెంట్‌ని అయినా వర్చువల్‌ రియాలిటీలోకి మార్చుకుని ప్రత్యేక VR హెడ్‌సెట్‌తో చూడొచ్చు. 

లెనోవో Vibe K4 Note ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ 
  • తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు 
  • ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌ 
  • Corning Gorilla Glass 3 రక్షణ ఉంది. 
  • 64-bit MediaTek octa-core ప్రాసెసర్‌ని వాడారు 
  • ర్యామ్‌ 3జీబీ 
  • ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని 128జీబీకి పెంచుకోవచ్చు. 
  • డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. ముందు 5 మెగాపిక్సల్‌. 
  • బ్యాటరీ సామర్థ్యం 3,300mAh. 
  • ఫోన్‌ ధర సుమారు రూ.11,999. 
  • ఒకవేళ VR హెడ్‌సెట్‌తో పాటు కొనుగోలు చేయాలనుకుంటే రూ.12,500 చెల్లించాలి.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top