జీమెయిల్‌తోనే గూగుల్‌ డ్రైవ్‌కి అనుసంధానమై డైరీ రాయవచ్చు

0
వై-ఫై నెట్‌వర్క్‌కి అనుసంధానమై ఉంటే వాడుతున్న జీమెయిల్‌తోనే గూగుల్‌ డ్రైవ్‌కి అనుసంధానమై డైరీ రాయవచ్చు. ఆటోమాటిక్‌గా గూగుల్‌ డ్రైవ్‌లోకి డైరీ సింక్‌ అవుతుంది. ఇక మీ ‘జర్నీ’ మొత్తం టెక్స్ట్‌ రూపంలోనే కాదు. ఫొటోలు, వీడియోల్లోనూ డైరీలో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఆప్‌ని రన్‌ చేసి ‘ప్లస్‌’ గుర్తుతో డైరీ ఎంట్రీలు రాసుకోవచ్చు. ఎంట్రీని సేవ్‌ చేస్తే మీరు ఉన్న లొకేషన్‌, అక్కడి వాతావరణ వివరాలూ సేవ్‌ అవుతాయి. డైరీ రాసే సమయంలో Undo, Redo చేయవచ్చు. 

రాసిన ఎంట్రీలో పదాలు, అక్షరాల్ని కూడా లెక్కగట్టి చూపిస్తుంది. ఆప్‌ హోం మెనూలోకి వెళ్లి డైరీని క్యాలెండర్‌ వ్యూలో చూడొచ్చు. డైరీలో అప్‌లోడ్‌ చేసిన అన్ని ఫొటోలు, వీడియోలకు Photos, Videos మెనూ ఉంది. ప్రేరణకలిగించే సూక్తుల్ని Inspirations మెనూలో చదువుకోవచ్చు. 

ఇక ఆప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫాంట్‌ సైజు, లైన్‌ స్పేస్‌లను మార్చుకోవచ్చు. డైరీని ‘పాస్‌కోడ్‌’తో లాక్‌ చేయవచ్చు.
మరిన్ని వివరాలకు సందర్శించండి

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top