Mobile battery backup tricks in telugu: మొబైల్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను పెంచుకొనే - చిట్కాలు మరియు సూచనలు

0
చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు నేడు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య బ్యాటరీ బ్యాక‌ప్. ఎంత పెద్ద బ్యాట‌రీ ఉన్న ఫోన్ వాడినా ఎక్కువ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కొంద‌రు త‌క్కువ బ్యాట‌రీ ఉన్నా చాలా పొదుపుగా దాన్ని వాడుకుంటారు. దీంతో ఎక్కువ బ్యాక‌ప్ వ‌స్తుంది. అయితే ఎవ‌రైనా కింద సూచ‌న‌లు పాటిస్తే దాంతో బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను పెంచుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వైబ్రేష‌న్ ఫీచ‌ర్‌ను ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ ఫీచర్ ఆన్‌లో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ బ్యాట‌రీ వాడుకుంటుంది. కాల్స్, ఎస్ఎంఎస్‌లు, ఇత‌ర యాప్‌ల‌కు చెందిన నోటిఫికేష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్ కానీ, లేదంటే టైప్ చేస్తున్న‌ప్పుడు, ఫోన్‌ను ప‌ట్టుకున్న‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్‌లు అన్నింటినీ ఆఫ్ చేయాలి. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ కొంత వ‌ర‌కు పెరుగుతుంది.
  • సాధ్య‌మైనంత వ‌ర‌కు బ్లాక్ క‌ల‌ర్ ఉన్న వాల్‌పేప‌ర్ల‌నే సెట్ చేసుకోండి. ఎందుకంటే ఆ వాల్‌పేప‌ర్లు త‌క్కువ బ్యాట‌రీని వాడుకుంటాయి. అదే క‌ల‌ర్‌ఫుల్ వాల్‌పేప‌ర్లు అయితే బ్యాట‌రీని ఎక్కువ‌గా వాడుకుంటాయి.
  • స్మార్ట్‌ఫోన్‌లో ఉండే జీపీఎస్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచ‌వ‌ద్దు. ఎందుకంటే జీపీఎస్ ఆన్‌లో ఉంటే బ్యాట‌రీ ఎక్కువ‌గా వినియోగం అవుతుంది. అవ‌స‌రం అనుకుంటేనే దాన్ని ఆన్ చేయండి.
  • మీ ఫోన్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోండి. ఆయా కంపెనీలు తాము విడుద‌ల చేసే ఫోన్ మోడ‌ల్స్‌కు అప్‌డేట్స్‌ను ఇస్తుంటాయి. వాటిని వేసుకుంటే బ్యాట‌రీ స‌మ‌స్య‌లు పోతాయి. దీంతో బ్యాక‌ప్ పెరుగుతుంది.
Mobile battery backup tricks in telugu. Following Todaype technology news in telugu can increase mobile battery life time very easily

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top