గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచిత క్రెడిట్ పాయింట్లుతో ప్రీమియం యాప్స్‌, గేమ్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు

0
ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని ప్రీమియం యాప్స్‌, గేమ్స్ ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వాటిని డ‌బ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అవి ఉచితంగా రావు. అందుకు గాను గూగుల్ ప్లే స్టోర్‌లో డెబిట్‌, క్రెడిట్ కార్డు లేదా అందుబాటులో ఉన్న ఇత‌ర పేమెంట్ ఆప్ష‌న్ల ద్వారా స‌ద‌రు యాప్స్‌ను కొనుగోలు చేయాలి. అయితే అలాంటి ప్రీమియం యాప్స్‌ను కొనాల్సిన ప‌నిలేకుండా, ఫ్రీగానే పొంద‌వ‌చ్చు. అందుకు యూజ‌ర్లు చిన్న ప‌ని చేయాల్సి ఉంటుంది.

గూగుల్ తాజాగా భార‌త్‌లోని యూజ‌ర్ల‌కు 'Google Opinion Rewards' అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లో ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంత‌రం యాప్‌ను ఓపెన్ చేసి అందులో యూజ‌ర్ త‌న‌కు చెందిన వివ‌రాల‌ను నింపాల్సి ఉంటుంది. ఆ త‌రువాత యూజ‌ర్‌కు గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు చిన్న‌పాటి స‌ర్వేల‌ను పంపుతుంది. వాటిని యూజ‌ర్ పూర్తి చేస్తే చాలు, దాంతో గూగుల్ ప్లే స్టోర్‌కు గాను ఉచిత క్రెడిట్ పాయింట్లు ల‌భిస్తాయి. వాటిని ప్లే స్టోర్‌లో వాడుకోవ‌చ్చు. వాటితో ప్రీమియం యాప్స్‌, గేమ్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

గూగుల్ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఈ ఒపీనియ‌న్ రివార్డ్స్ అనే ప్రోగ్రామ్ గ‌తంలో యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో విడుద‌లైంది. తాజాగా భార‌త్‌తోపాటు సింగ‌పూర్‌, ట‌ర్కీ దేశాల‌కు చెందిన యూజ‌ర్ల‌కు కూడా ల‌భిస్తోంది. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్ష‌న్ ఉన్న యూజ‌ర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top