వాట్స్‌యాప్‌ త్వరలో వీడియో కాలింగ్‌ సదుపాయం

0
స్మార్ట్‌ఫోన్లలో ఇప్పుడు కచ్చితంగా ఉండే యాప్‌లలో వాట్స్‌యాప్‌ ఒకటి. ఇది వయోభేదం లేకుండా అందరి అరచేతులనూ అలంకరిస్తున్న మొబైల్ యాప్.  ఈ యాప్‌ ఇప్పుడు మరో కొత్త ఆప్షన్‌తో అందరికీ మరింత చేరువ కానుంది.

వాట్స్‌యాప్‌ త్వరలో వీడియో కాలింగ్‌ సదుపాయం కల్పించనున్నట్లుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. వాట్స్‌యాప్‌ నుంచి అధికారికంగా ఈ సమాచారం రానప్పటికీ జర్మనీకి చెందిన వెబ్‌సైట్‌ ఈ విషయం వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.

2016 ప్రారంభంలో ఇది అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఫేస్‌బుక్‌కే చెందిన వాట్స్‌యాప్‌లో ఇంతవరకు వీడియో కాలింగ్‌ లేకపోవడాన్ని వినియోగదారులు లోటుగానే భావిస్తున్నారు. స్కైప్‌, హ్యాంగవుట్స్‌లో ఉన్న ఈ ఆప్షన్‌ వాట్స్‌యాప్‌లోనూ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వినియోగదారుల్లో ఉంది. తాజా ముందడగుతో ఆ లోటు భర్తీ కానుంది. 


అయితే, వాట్స్‌యాప్‌లో వీడియో కాలింగ్‌ను తొలుత ఐఓఎస్‌కు అనుగుణంగా విడుదల చేస్తారని, అనంతరం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనూ పనిచేసేది తీసుకొస్తారని తెలుస్తోంది. ఐఓఎస్‌పై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారని జర్మనీ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీంతోపాటు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఒకేసారి వేర్వేరువ్యక్తులు, బృందాలతో చాటింగ్‌ చేసేలా ‘మల్టీ ట్యాబ్‌ యూఐ’ సదుపాయం కూడా రానుందని చెబుతున్నారు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top