ప్రపంచంలోనే మొదటి ... ఈ-సిగరెట్ స్మార్ట్‌ఫోన్

0
సిగరెట్ తాగేవారికి కలిగే దుష్ప్రభావాలను తగ్గించడం కోసం 'ఈ-సిగరెట్(ఎల‌క్ర్టానిక్ సిగ‌రెట్)' ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం విదితమే. అయితే ఇకపై దీన్ని ధూమపాన ప్రియులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఆస్వాదించవచ్చు. అమెరికాకు చెందిన 'వాపొర్‌కేడ్' అనే కంపెనీ కొత్తగా వినియోగంలోకి తెచ్చిన ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 'ఈ-సిగరెట్‌'ను నిక్షిప్తం చేశారు. దీంట్లో వివిధ రకాల ఫ్లేవర్లు కూడా అందిస్తున్నారు.

'జూపిటర్ ఐఓ 3' పేరిట రూ.19,700 ధరకు లభిస్తున్న ఈ డివైస్ 'ప్రపంచంలోనే మొదటి స్మోకబుల్ స్మార్ట్‌ఫోన్‌'గా గుర్తింపు పొందింది. ఇది ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీంట్లో 3జీ సేవలను యూజర్లు వాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు బ్యాటరీలను కలిగి ఉండగా ఒక బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌కు ఉపయోగమవుతుంది. రెండో దాంతో 'ఈ-సిగరెట్‌'ను వాడుకోవచ్చు. అయితే ఈ రెండో బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించకపోతే అందులోని శక్తి స్మార్ట్‌ఫోన్‌కు పనికొస్తుంది.
'జూపిటర్ ఐఓ 3' స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఈ-సిగరెట్‌ను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పుల్ బటన్‌ను డివైస్‌పై ఏర్పాటు చేశారు. బటన్ నొక్కితే సిగరెట్ దానంతట అదే బయటికి వస్తుంది. ఉపయోగించాక మళ్లీ లోపలికి వెళ్లిపోతుంది. దీంట్లో వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా మింట్, పీచ్, కాఫీ తదితర ఫ్లేవర్లతో కూడిన లిక్విడ్ కాట్రిడ్జ్‌లు ఉంటాయి. ఇవి 4 ప్యాకెట్ల సిగరెట్లకు సమానం.

కాట్రిడ్జ్‌లోని లిక్విడ్ పరిమాణం, డివైస్‌లోని రెండో బ్యాటరీ లైఫ్ తదితర వివరాలను ట్రాక్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లో 'వాపొర్‌కేడ్ యాప్' ఉంటుంది. లిక్విడ్ అయిపోతున్నా, 'ఈ-సిగరెట్‌'ను రోజులో మోతాదుకు మించి వాడినా యూజర్‌కు ఈ యాప్ అలర్ట్స్‌ను కూడా పంపిస్తుంది. దీంతో స్మోకింగ్ తక్కువ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా అయిపోయిన కాట్రిడ్జ్ లిక్విడ్‌ను తీసేసి దాని స్థానంలో కొత్త క్యాట్రిడ్జ్‌ను రూ.990 కు మార్చుకునే వీలు క‌ల్పించారు.

ఈ-సిగరెట్స్, సిగార్స్, కాఫీ బీన్స్ తదితరాలను తయారు చేసే వాపొర్‌కేడ్ కంపెనీ జూపిటర్ ఐఓ 3కి మరిన్ని హంగులు అద్ది దాన్ని 4జీ కనెక్టివిటీతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని రూ.32,900 కు వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top