గూగుల్‌ ప్లే నుంచి ఆప్‌ రూపంలో లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌డేట్‌ అయితే చాలు

0
గూగుల్‌ బిల్ట్‌ఇన్‌గా అందించే Google Calendar ఆండ్రాయిడ్‌ మొబైల్ యూజర్లకు ఉంది. అయితే, గూగుల్‌ ప్లే నుంచి ఆప్‌ రూపంలో లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌డేట్‌ అయితే చాలు. గూగుల్‌ క్యాలెండర్‌ ఫ్లాట్‌ఫాం మారిపోతుంది. 

ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో క్యాలెండర్‌ ఈవెంట్స్‌ని చూపిస్తుంది. ఇక రోజువారీగా చేయాల్సిన పనుల్ని సులభంగా క్యాలెండర్‌లో సెట్‌ చేయవచ్చు. అందుకు అనువుగా తెరపై ప్లస్‌ గుర్తు కనిపిస్తుంది. తాకి చేయాల్సిన పనుల్ని, రిమైండర్స్‌ని సెట్‌ చేయవచ్చు. క్యాలెండర్‌ వ్యూని మార్చుకునేందుకు ఆప్‌ హోం మెనూలోకి వెళ్లాలి. Schedule, Day, 3 Day, Week, Month వ్యూలలో చూడొచ్చు. 

మీరు వాడుతున్న జీమెయిల్‌ తాలూక ఈవెంట్స్‌ అన్నింటినీ ఆటోమాటిక్‌గా సింక్‌ చేసి చూపిస్తుంది. ఉదాహరణకు ప్రొఫైల్‌ ఫొటోతో పాటు స్నేహితుల పుట్టిన రోజు వివరాలను చూపిస్తుంది. 

అలాగే, మీరేదైనా ప్రాంతానికి వెళ్తున్నట్లయితే ఆ లొకేషన్‌కి సంబంధించిన మ్యాప్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో వాడే అన్ని ఫోన్లు, ట్యాబ్‌లకు క్యాలెండర్‌ అనుకూలం.

మరిన్ని వివరాలకు సందర్శించండి

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top