కంప్యూటర్లు హ్యాకర్లు,వైరస్‌ల బారిన పడకుండా కేవలం రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

0
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కంప్యూటర్లు హ్యాకర్లు,వైరస్‌ల బారిన పడకుండా కేవలం రూపాయికే సేవలు అందిస్తోంది.

‘ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌’ పేరిట రూపాయికే ఈ-మెయిల్‌ సర్వీసులను అందిస్తోంది. జైపూర్‌కు చెందిన డేటా ఇన్ఫోసిస్‌ అనే కార్పొరేట్‌ ఈ-మెయిల్‌ సర్వీస్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను కేవలం తమ వినియోదారులకే అందించనుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ‘వైరస్‌కు, హ్యాకింగ్‌కు, స్పామింగ్‌కు ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తోచెక్‌ పెట్టండి.’ అని ట్వీట్‌లో పేర్కొంది.

ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సేవలు ఇలా..
బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఏడాదికి రూ.365 చెల్లిస్తే ఈ ఎక్స్‌జెన్‌ సేవలను ఈ-మెయిల్స్‌తో లింక్‌ చేస్తారు. రూ.365కి 1 జీబీ స్టోరేజి, రూ.999కి 10 గీగా బైట్ల స్టోరేజీ ఉంటుంది. ఏడాది ఒకసారి మాత్రమే చెల్లింపులు ఉంటాయని డేటా ఇన్ఫోసిస్‌ సీఈవో అజయ్‌ తెలిపారు. ఈ-మెయిల్స్‌ విషయంలో కేవలం వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ-మెయిల్‌ సర్వీస్‌కి మొబైల్‌ యాప్‌ కూడా ఉంది. కార్పొరేట్‌, పర్సనల్‌ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ ద్వారా సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ఈ-మెయిల్‌ ప్లాట్‌ఫాం ద్వారా గ్రూప్‌ మెయిల్స్‌, షెడ్యూలింగ్‌ మెయిల్స్‌ పంపుకునే సౌలభ్యం కూడా ఉంది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top