బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌-1’ పేరుతో 4జీ ఫీచర్‌ ఫోన్‌ రూ.2,200కు విడుదల చేసింది

0
బీఎస్‌ఎన్‌ఎల్‌ మరియు మైక్రోమాక్స్‌ సంస్థలు సంయుక్తంగా రిలయన్స్‌ జియోకి పోటీగా 4జీ ఫీచర్‌ ఫోన్‌ మంగళవారం విడుదల చేశాయి. ‘భారత్‌-1’ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర రూ.2,200గా కంపెనీ నిర్ణయించింది. శుక్రవారం(అక్టోబర్‌ 20) నుంచి ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులకు చేరువ కావడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకొచ్చారు. నెలకు రూ.97 రీఛార్జ్‌తో అపరిమిత లోకల్‌ కాల్స్‌, హైస్పీడ్‌ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అందించనుంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ 22 స్థానిక భాషలను సపోర్ట్‌ చేస్తుందని మైక్రోమాక్స్‌ సహవ్యవస్థాపకుడు రాహుల్‌శర్మ తెలిపారు. 100 లైవ్‌ టీవీ ఛానెల్స్‌ను వినియోగదారులు పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘భారత్‌-1 ఫోన్‌ ఫీచర్లు..
  • 2.4 అంగుళాల స్క్రీన్‌
  • క్వాల్‌కమ్‌ 205 ప్రాసెసర్‌
  • 512ఎంబీ ర్యామ్‌
  • 2మెగాపిక్సల్‌ వెనుక కెమెరా
  • వీజీఏ సెల్ఫీ కెమెరా
  • 4జీ వోల్ట్‌, డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం
  • 2000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top