చాలా సందర్భాల్లో ఆధార్ లేకుండా పనికావడం అసాధ్యమైపోయింది. మనిషి నిత్య జీవితంలో ఆధార్ అంతర్భాగమైపోయింది. దీంతో ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లడం తప్పనిసరిగా మారింది. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తించిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎంఆధార్ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఉంటే ఇకపై ఆధార్ కార్డును మీ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉండగా.. త్వరలో ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గూగుల్ ప్లే ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొబైల్ ఆధార్ యాప్‌ను వినియోగించాలంటే ముందుగా మొబైల్ నెంబర్‌ను యాప్‌నకు అనుసంధానించాల్సి ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ పూర్తి వివరాలను పొందొచ్చు. దీనికి లాక్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆధార్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను కూడా ఇతరులకు షేర్ చేసే సదుపాయం కల్పిస్తున్నారు