‘నోకియా స్మార్ట్‌ఫోన్‌లన్నీ ఆండ్రాయిడ్‌ ‘ఓ’కు అప్‌డేట్‌ అవుతాయి మరియు ఆండ్రాయిడ్‌ నోగట్‌తో విడుదల కానున్నాయి

0
Nokia updates Android O version OS
నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయి. అయితే ఇవి విపణిలోకి రాకముందే టెక్‌ అభిమానులకు శుభవార్తను తీసుకొచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు కచ్చితంగా ఆండ్రాయిడ్‌ ‘ఓ’కు అప్‌డేట్‌ అవుతాయని హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించింది. నోకియా ఆండ్రాయిడ్‌ ఫోన్లు రెండేళ్లపాటు ఎప్పటికప్పుడు నూతన సాఫ్ట్‌వేర్‌లకు అనుగుణంగా అప్‌డేట్‌ అవుతాయని తెలిపింది. నోకియా తీసుకొచ్చే స్మార్ట్‌ఫోన్లన్నీ ఆండ్రాయిడ్‌ నోగట్‌తో విడుదల కానున్నాయి.
ఒకప్పుడు ఫీచర్‌ మొబైళ్ల విపణిలో వీటిదే అగ్రస్థానం. ఇప్పుడు ఆ పేరుతోనే హెచ్‌ఎండీ గ్లోబల్‌ సరికొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది.
‘నోకియా స్మార్ట్‌ఫోన్‌లన్నీ ఆండ్రాయిడ్‌ ‘ఓ’కు అప్‌డేట్‌ అవుతాయి. గూగుల్‌ అధికారికంగా దీనిని విడుదల చేసిన తర్వాత ఫోన్లు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తీసుకుంటాయి. అదేవిధంగా ప్రతి నెలా ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇచ్చేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ కట్టుబడి ఉంది’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్విక్‌ టోగెల్స్‌, స్మార్ట్‌ టెక్ట్స్‌ సెలక్ట్‌, పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఇలా అనేక ఫీచర్లు ఆండ్రాయిడ్‌ ఓతో వస్తాయి. ఈ ఏడాది మార్చిలో ఆండ్రాయిడ్‌ ‘ఓ’ను గూగుల్‌ విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని డివైజ్‌లకు బీటా వెర్షన్‌ను అందిస్తోంది.

హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా 3310(2017)ను భారత విపణిలోకి విడుదల చేయగా, ఇంకా అమ్మకాలు జరపట్లేదు. దీనితోపాటు నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను కూడా భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహలు చేస్తోంది. ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.16,000.. రూ.13,000.. రూ.10,000 ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా పేరు మీద స్మార్ట్‌ఫోన్ల వివరాలను వెల్లడించింది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top