ఐడియా సెల్యులార్‌ రూ.396తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటాతో పాటు 3,000 నిమిషాల లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌

0
ఐడియా సెల్యులార్‌ తన వినియోగదారుల కోసం ఓ బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రీపెయిడ్‌ కస్టమర్లు రూ.396తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటాను పొందవచ్చు. దీనిని 70 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. డేటాతో పాటు 3,000 నిమిషాల లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ రీఛార్జ్‌తో ఐడియా నెట్‌వర్క్‌తో పాటు, ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే రోజులో 300 నిమిషాలు, వారానికి 1,200 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పరిమితి దాటిన కాల్స్‌కు నిమిషానికి 30పైసలు వసూలు చేయనున్నారు. ఇక రోజుకు 1జీబీ డేటాను మాత్రమే ఈ ప్యాక్‌ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది.

రిలయన్స్‌ జియో రాకతో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top