వొడాఫోన్‌ రూ.19 ప్రారంభ ధరతో ఉచిత కాల్స్‌, 4జీ డేటాను అందిస్తుంది

0
Vodafone Unlimited voice calls offer
వొడాఫోన్‌ టెలికాం రంగంలో తన మొబైల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్‌ సూపర్‌ డే, సూపర్‌ వీక్‌ పేరుతో ఈ సదుపాయాన్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం ప్రీ పెయిడ్‌ యూజర్లకు మాత్రమే అందిస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది.

టెలికాం రంగంలో జియోను తట్టుకునేందుకు పలు టెలికాం సంస్థలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు చౌకధరల్లో డేటాను అందిస్తుండగా.. తాజాగా వొడాఫోన్‌ కూడా ఈ జాబితాలో చేరింది.

వొడాఫోన్‌ సూపర్‌ డే ఆఫర్‌ ప్రకారం.. రూ. 19తో రీఛార్జ్‌ చేస్తే అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ ఉచితంగా చేసుకోవచ్చు. దీంతో పాటు 100ఎంబీ 4జీ డేటాను కూడా అందిస్తోంది. ఇక సూపర్‌ వీక్‌ ఆఫర్‌ కింద రూ. 49తో రీఛార్జ్‌ చేసుకుంటే.. అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌తో పాటు 250ఎంబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది.

జియోలోనూ రూ. 19 ప్రారంభ ధరతో డేటా ఆఫర్‌లు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నిలదొక్కుకునేందుకే వొడాఫోన్‌ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ యూజర్లకు ఇది లాభదాయకంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top